మరోసారి ఆ మాస్ డైరెక్టర్ తో రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల జాబితా తీసుకుంటే అందులో మిరపకాయ్ మూవీ కూడా ఉంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక షాక్ లాంటి డిజాస్టర్ తర్వాత హరీష్ శంకర్ చాలా కాలం వెయిట్ చేయగా రవితేజ ఛాన్స్ ఇచ్చాడు.

ఇక షాక్ తో వీరిద్దరూ డిజాస్టర్ కొత్తగా మిరపకాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక హరీష్ శంకర్ కి కమర్షియల్ దర్శకుడి అనే ఇమేజ్ ని ఈ మూవీ తీసుకొచ్చింది తరువాత మళ్ళీ రవితేజతో హరీష్ శంకర్ కి సినిమా చేసేందుకు టైమ్ దొరకలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు.

ఇక రవితేజ సుదీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూవీ పూర్తి చేశాడు. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ని నెక్స్ట్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్, రవితేజతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరీష్ శంకర్ మైత్రీ మూవీ మేకర్స్ తో చేస్తున్నాడు. మరో రెండు సినిమాలు అదే బ్యానర్ లో చేయడానికి ఈ దర్శకుడు కమిట్ అయ్యాడు. ఇక రవితేజ గతంలో అమర్ అక్బర్ అంటోనీ మూవీ మైత్రీలో చేశాడు.

ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో మరో సినిమా వారితో చేస్తానని కమిట్ అయ్యాడు. ఈ నేపధ్యంలో ఇప్పుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ సెట్ చేయడానికి మైత్రీ నిర్మాతలు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత వచ్చే ఏడాది ఈ మూవీ స్టార్ట్ కావొచ్చని అంచనా వేస్తున్నారు.