మరోసారి దిల్ రాజు పై విమర్శలు.!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్స్ లో కానీ దిల్ రాజు కూడా ఒకరు. మరి దిల్ రాజు ఇప్పుడు వరకు ఎన్నో భారీ సినిమాలు నిర్మాణం వహించి ఇప్పటికీ పలు కీలక ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నారు. మరి రాబోతున్న సంక్రాంతికి కూడా పలు అవైటెడ్ చిత్రాలు కొనుకొని కూర్చున్న తాను మరోసారి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

గతంలో కూడా ఓ సారి యంగ్ హీరో నిఖిల్ నటించిన “కార్తికేయ 2” విషయంలో కూడా రిలీజ్ ఆపుకోవాలని పోస్ట్ పోన్ చేసుకోవాలని బాగా ఒత్తిడి చేసినట్టుగా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే తరహాలో యంగ్ హీరో తేజ సజ్జ యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ల చిన్న సినిమా అయినటువంటి “హనుమాన్” విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

నిజానికి హనుమాన్ తో పోటీగా గుంటూరు కారం సినిమా ఉంది. దీనిని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా హనుమాన్ టీం ని పోస్ట్ పోన్ చేసుకోవాలని దిల్ రాజు సూచిస్తున్నాడు. నిజానికి జనవరి 12 హనుమాన్ యూనిట్ ముందు అనౌన్స్ చేశారు. తర్వాత గుంటూరు కారం యూనిట్ 13 నుంచి 12 కి షిఫ్ట్ చేశారు.

సో డేట్ మేము ముందు అనౌన్స్ చేశామని వెనక్కి తగ్గము అని హనుమాన్ యూనిట్ చెప్తుంటే వారిని ఆ డేట్ నుంచి ఎలాగైనా షిఫ్ట్ చేయాలనీ విశ్వ ప్రయత్నాలు ఇపుడు జరుగుతున్నాయి. అయితే దిల్ రాజు కూడా ప్రశాంత్ వర్మకి తన అనుభవంతో ఓ సలహా ఇచ్చానని పాటిస్తాడో లేదో అతని ఇష్టం అంటూ చెప్పింది కూడా క్లియర్ గా ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దీనితో చిన్న హీరో చిన్న నిర్మాతలు సినిమా కావడంతో ఇలా చేస్తున్నారని దిల్ రాజుపై నెటిజన్స్ మండిపడుతున్నారు.