రక్షాబంధన్ రోజు సోదరుడి చేతిలో దెబ్బలు తిన్న రకుల్…?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను పొంది అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో రకుల్ సౌత్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం సౌత్లో ఈ అమ్మడు ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే రకుల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలు వీడియోలతో పాటు పర్సనల్ ఫ్యామిలీ విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రకుల్ ఎన్నోసార్లు తన సోదరుడితో ఉన్న అనుబంధం గురించి అభిమానులతో పంచుకుంది. తాజాగా సోషల్ మీడియాలో రకుల్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. రక్షాబంధన్ సందర్భంగా రకుల్ తన సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రకుల్ సోదరుడు తన చెంప చెళ్లుమనిపించాడు.

అసలు విషయం ఏమిటంటే ఈ వీడియోలో రకుల్ ఆమె సోదరుడు అమన్ తో ఒక ఓ ఛాలెంజ్ పెట్టుకుంది. ఇద్దరు నీళ్ళు తాగి వన్ టూ త్రీ అంటూ చేతి వేళ్లను ఒకేసారి చూపించాలి. ఈ ఛాలెంజ్ ముందు రకుల్ సోదరుడు ఓడిపోగా రకుల్ అతడి చెంపను బలంగా కొట్టింది. ఆ తర్వాత రకుల్ ఓడిపోగా.. ఆమె సోదరుడు రకుల్ చెంప పగలగొట్టాడు. రక్షాబంధన్ సందర్భంగా ఈ ఫన్నీ ఛాలెంజ్ వీడియోను రకుల్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. తన సోదరుడి గురించి ఎమోషనల్ గా రాసుకొచ్చింది. మేమిద్దరం ఎప్పుడూ గొడవ పడతాం, ఇద్దరం తిరిగి కలుస్తాం మేమెప్పుడు ఒకరికొకరం తోడుగా ఉంటామని నాకు తెలుసు. నేను నిన్ను ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. రక్షా బంధన్ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది