Olivia Morris : కొమరం బీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన జెన్ని..!బాయ్ ఫ్రెండ్ తో కలసి సినిమా చూసిన ఓలివా..!

Olivia Morris: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయినప్పటి నుండి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతి ని నలుదిక్కుల తెలియచేసింది.రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కు ఆర్ఆర్ఆర్ ఒక నిదర్శనం.ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన కు అభిమానులు నిరాజనాలు పడుతున్నారు.మార్చ్ 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు సెలబ్రిటీలు, రాజకీయనాయకులు అందరు తమ తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు.1920 వ కాలం బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరిస్‌ నటించగా, రామ్ చరణ్ కు జోడిగా అలియాభట్ నటించిన సంగతి తెలిసిందే.

 

ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్టీఆర్ కి జోడిగా ఓలివియా మోరిస్ జెన్నీఫర్‌ అలియాస్‌ జెన్నీ అనే బ్రిటిష్ యువతీ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయం సాధించడంతో మీడియా తో ముచ్చటించింది.ఈ సందర్బంగా ఓలివియా మాట్లాడుతూ, సినిమా ఘన విజయం సాధించినందుకు ఆనందాన్ని వ్యక్త పరిచింది. అంతే కాదు ఈ సినిమాని తన బాయ్ ఫ్రెండ్ తో కలసి చూశానని పేర్కొంది.ఈ సినిమా లో ని కొన్ని సన్నివేశాలకు తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చింది.

అంతే కాదు చిత్రం లో ని ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ…ఎన్టీఆర్ అమేజింగ్ పర్సన్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ ఒలీవియా మోరిస్ ప్రశంసలు కురిపించింది. కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన చూసి తాను కన్నీరు పెట్టుకున్నాని ఒలీవియా పేర్కొంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ కు నాటు నాటు సాంగ్ బాగా నచ్చింది అని, అందులోని డాన్స్ ను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నట్లు పేర్కొంది.

ఇంకా షూటింగ్ సమయం లో హైదరాబాద్ తో తన అనుబంధం గురించి కూడా ఓలివియా పంచుకుంది.చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ లో నేను 20 రోజులు ఉన్నా. కానీ సిటీ మొత్తం చూసే అవకాశం రాలేదు. కొన్ని ప్రాంతాలు మాత్రం చూశానని ఒలీవియా తెలిపింది.శిల్పారామం బాగా నచ్చింది అని అక్కడ నుంచి తన తల్లికి, సోదరికి సిల్క్‌ స్కార్ఫ్‌తో పాటు తన బాయ్‌ఫ్రెండ్‌కు బహుమతులు తీసుకున్నట్లు ఒలీవియా పేర్కొంది.