JSW Steel Shares: పాత కాగితాల్లో దొరికిన అదృష్టం.. ఇప్పుడు వాటి విలువ 80 కోట్లు!

ఒక సామాన్య కుటుంబానికి ఊహించని లాభాలు ఎలా చేకూరతాయో చూపించే సంఘటన ఇది. మూడు దశాబ్దాల క్రితం ఒకరు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు వారి కుటుంబానికి అదృష్ట తలుపులు తెరిచింది. అప్పట్లో ఎంతో నమ్మకంతో పెట్టిన డబ్బు, వదిలేసినట్లుగా మర్చిపోయిన షేర్ సర్టిఫికెట్లు ఇప్పుడు కోట్ల రూపాయల లాభాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

1990లో ఓ వ్యక్తి JSW స్టీల్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. అప్పట్లో అది ఓ పెద్ద మొత్తం. అయితే కాలంతో పాటే ఆ విషయాన్ని మరచిపోయాడు. ఇటీవల ఆయన కుమారుడు పాత కాగితాలు వెదుకుతూ ఆ షేర్ సర్టిఫికెట్లు గుర్తించాడు. ఆసక్తితో కంపెనీకి సంప్రదించగా… షాక్ తినేలా విలువ తెలిసింది.. 80 కోట్లు! ఒక్క లక్ష రూపాయలు 34 ఏళ్లలోనే అష్టగణితంగా పెరిగాయి.

ఈ విషయం సౌరవ్ దత్తా అనే నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు చేసే వారికి ఇదో పాఠం అంటున్నారు. ఓపిక, సరైన కంపెనీ ఎంపిక ఉంటే.. చిన్న పెట్టుబడులు కూడా జీవితం మలుపు తిప్పే అవకాశముందని ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది. చాలామంది ఇది చూసి ఇప్పుడు తమ పెట్టుబడి ప్రణాళికలు పునరాలోచిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు ఒకప్పుడు వచ్చిన నిర్ణయాన్ని భవిష్యత్తు ఎలా మార్చగలదో గుర్తుచేస్తాయి. పెట్టుబడి విషయంలో అవగాహన, ఓపిక, అలాగే సమయం ఎంత కీలకమో ఇలాంటి నిదర్శనాలు తేటతెల్లం చేస్తున్నాయి. పెద్ద మొత్తాలు అవసరం లేదు… కానీ సరైన కంపెనీ ఎంపిక చేస్తే, సంవత్సరం కాదు… పదేళ్లు, ముప్పై ఏళ్లు ఓపిక ఉంటే… అదృష్టమే తలుపు తడుతుంది.

పిచ్చి పీక్స్|| Journalist Bharadwaj EXPOSED  Rajendra Prasad & Ali Controversy || Telugu Rajyam