Abbas : ఒకప్పటి అమ్మాయిల డ్రీం హీరో ఎవరంటే అబ్బాస్ అని టక్కున చెబుతారు. ప్రేమ దేశం సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడుగా మారడు. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అబ్బాస్. తన హెయిర్ స్టైల్, స్కిన్ కలర్‌తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ని ఫ్లాట్ చేసిన అబ్బాస్ పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. 20 ఏళ్ళ వయసులోనే హీరోగా అడుగుపెట్టి.. 40 ఏళ్లకే నటనకు గుడ్‌బై చెప్పేశాడు అబ్బాస్. అలా సినీ పరిశ్రమకు దూరమైన అబ్బాస్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. సినిమాలు, మోడలింగ్ మానేసిన అతడు ఎక్కడ ఉంటున్నాడు.. ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి స్పష్టమైన క్లారిటి లేదు. ఇలా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచిన అతడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో దర్శనమిస్తున్నాడు. కొంతకాలంగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్న అబ్బాస్, ఇప్పుడు పూర్తిగా న్యూజిలాండ్ వాసి అయిపోయాడు.
డబ్బుల కోసం ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేశాడు. అవి దారుణంగా ప్లాప్ అయ్యాయి. మధ్యమధ్యలో తెలుగు , తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరికి నెగెటివ్ రోల్స్ కూడా చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లకు ఆ నెగిటివ్ అవకాశాలు కూడా రాలేదు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో అబ్బాస్ అవకాశాలను పూర్తిగా కోల్పోయాక, ఇక బతకడం కోసం న్యూజిలాండ్ వెళ్ళాడు. జాబ్ దొరకలేదు. మొదట్లో న్యూజి లాండ్ లో పెట్రోల్ బంక్ లో కూడా పని చేయాల్సి వచ్చింది. పెట్రోల్ బంక్ లో పని మానేసాక, భవన నిర్మాణ పనుల కోసం కూలీకి కూడా అబ్బాస్ వెళ్ళాడు. అలా అదే ఫీల్డ్ లో అనుభవం సంపాదించి.. అబ్బాస్ అక్కడే స్థిరపడిపోయాడు. ఇప్పుడు అబ్బాస్ న్యూజిలాండ్ లో బిల్డర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
అయితే సినిమా అవకాశాలు తగ్గిపోవడం డిప్రెషన్‌కు లోనైన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పబ్లిక్ స్పీకర్‌గా కోర్స్ తీసుకున్న అతడు యువతకు లైఫ్‌పై స్పీచ్‌లు ఇస్తూ వారిలో స్పూర్తి నింపినట్టు వెల్లడించాడు. నిజానికి అప్పట్లో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు చేశాడు అబ్బాస్. అయితే చాలా తక్కువ సమయంలోనే ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. మంచి టాలెంట్ ఉన్నా.. ఆ తర్వాత సైడ్ హీరో పాత్రలకు, క్యారెక్టర్ ఆర్టిస్ ల పాత్రలకే పరిమితమైపోయాడు. కారణం ఒక్కటే.. తన టాలెంట్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఇక ఇపుడు మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఇక ఇప్పుడైనా మంచి పాత్రాలను చేయాలనీ ఆశిద్దాం.