Pruthvi : ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లానంటున్న పృథ్వీ…. క్యాష్ షోలో ఎమోషనల్…!

Pruthvi : పృథ్వీ అనగానే పెళ్లి సినిమాలో శాడిస్టు మొగుడిగా తన నటన గుర్తొస్తుంది. అల్లరిగా ఆకతాయి పాత్రలతో అప్పటి హీరోలలో క్రేజ్ సంపాదించుకున్న పృథ్వీ సౌత్ భాషలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ షో కోసం 90లా నాటి క్రేజీ హీరోలు పృథ్వీ, రోహిత్, వెంకట్, ప్రేమ అతిధులుగా వచ్చారు.

షో ఆద్యంతం నవ్వులతో, పంచులతో సాగింది. ఇక చాలా కాలం తరువాత రోహిత్ కనిపించడం షో కీ హైలైట్. దేవుడు వరమందిస్తే పాటతో రోహిత్, రుక్కు రుక్కుమని పాటతో పృథ్వీ, నీ నవ్వే నాద స్వరమే పాటతో ప్రేమా, ఏనాడూ వీడని వరమా పాటతో వెంకట్ ఎంట్రీ ఇచ్చారు. షో మొదట్లోనే సుమ రోహిత్, వెంకట్ ను మీరు కలిసి నటించలేదు కదా అని అడుగగా నటించలేదు కానీ మంచి స్నేహితులం అంటూ చెప్పారు. ఇక మీరు కలిసి సినిమా చేయలేదు కాబట్టే ఫ్రెండ్స్ అయ్యారు అంటూ పంచ్ వేసింది.

ఇక క్యాష్ ప్రోగ్రాములో స్కిట్ వేయించడం మాములే. అలా ప్రేమా వేలు తెగితే ఒక్కో హీరోతో ఒక్కో వెర్షన్ చేయించింది సుమ. మొదట వెంకట్ తో ప్రేమ చూపించమని అడుగగా ప్రేమ వేలు తెగగానే నోట్లో పెట్టుకున్నట్లు చేసారు. నాగార్జున, వెంకటేష్ లలో ఎవరికి సపోర్టింగ్ యాక్టర్ గా చేసినందుకు హ్యాపీగా ఫీలవుతున్నారని సుమ అడగగా నాగార్జున అని నేను నాగ్ సార్ ని లవ్ చేస్తున్నానని పృథ్వీ చెప్పారు. అమ్మాయి అయ్యుంటే నాగార్జున ను పెళ్లి చేసుకునే వాడినని చెప్పారు.సుమ వరస్ట్ మెమొరీ ఏమిటని అడగగా పృథ్వీ నాకు అందమైన బాబు పుట్టాడని ఆ సమయంలో చాలా హ్యాపీగా ఉన్నానని లైఫ్ సూపర్ గా ఉందని ఆ సమయంలో బాబు ఆటిజంతో బాధ పడుతున్నాడని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్లానని పృథ్వీ చెప్పుకొచ్చారు. క్యాష్ షోలో పృథ్వీ ఎమోషనల్ అయ్యారు