OG Trailer Update: కల్ట్స్ రెడీగా ఉండడమ్మా.. ఓజీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

OG Trailer Update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులతో పాటు మూవీ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ ఓజీ(ఓజాస్ గంభీర). చాలా కాలం తర్వాత ఈ మూవీ పవన్ స్టైలిష్ లుక్‌లో నటించారు. దీంతో ఇటీవల ఏ సినిమాకు రానంత హైప్ ఈ మూవీకి వచ్చింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్‌తో చాలా స్టైలిష్‌గా నిర్మించారు.

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు మూవీపై హైప్స్ పెంచేశాయి. దీంతో మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. మూవీ ట్రైలర్‌ డేట్‌ను ప్రకటించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10.08 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇప్పటికే మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల తర్వాత పిచ్చి పీక్స్‌కి వెళ్లనుంది.

OG Trailer Update

పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో మూవీ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగవతం చేసిన మేకర్స్ తాజాగా మూవీ నుంచి ప్రకాష్ రాజ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సత్య దాదా అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్‌లో ప్రకాష్ రాజ్ చాలా గంభీరంగా ఉన్నాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే టికెట్స్ బుకింగ్ ఓపెన్ కానున్నాయి. ఏపీలో అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించింది. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు పది రోజుల‌ పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలుపుకొని టికెట్ రేటు మీద రూ.125.. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.150 పెంపునకు అంగీకారం తెలిపింది. అలాగే అర్థరాత్రి ఒంటి గంట నుంచి బెనిఫిట్ షో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర ఏకంగా రూ.1000లకు(జీఎస్టీతో కలిపి) విక్రయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది.