అఫిషీయల్ : బిగ్గెస్ట్ హిట్ “కాంతారా” ఓటిటి రిలీజ్ ఖరారు.!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ “కాంతారా” కూడా ఒకటి. స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా అలాగే తానే దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లతో ఈ చిత్రం ఏకంగా నిన్నటితో 400 కోట్ల భారీ గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ పై క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అతి త్వరలోనే ఈ సినిమా వస్తుందని టాక్ రాగా ఇప్పుడు అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అధికారికంగా ఇప్పుడు ఈ బిగ్ అప్డేట్ ని రివీల్ చేసేసారు. మరి ఈ అవైటెడ్ సినిమా ఈరోజే అంటే ఈరోజు అర్ద రాత్రి 12 గంటల నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే హిందీ భాషలో మాత్రం ఇప్పుడు అనౌన్స్ చెయ్యలేదు. కేవలం సౌత్ భాషల నుంచి మాత్రమే ఈ చిత్రం అందుబాటులో ఉండనున్నట్టు కన్ఫర్మ్ చేసారు. మరి కన్నడ, తెలుగు తమిళ్ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం రానున్నట్టు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని కేజీఎఫ్ మేకర్స్ నిర్మాణం వహించగా కన్నడలో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.