నిన్న రాత్రి నుంచి కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తూ వచ్చిన లేటెస్ట్ చిత్రమే “గుంటూరు కారం”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి మరియు శ్రీలీలా కాంబినేషన్ లో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఊహించని విధంగా మొదటి సాంగ్ లీక్ అవ్వడం అనేది షాకింగ్ గా మారగా.
మేకర్స్ ఆలస్యం చేయకుండా ఈ సాంగ్ పై అయితే అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాగా మొదట నాగవంశీ జస్ట్ డేట్ ని లాక్ చేయగా ఇప్పుడు డైరెక్ట్ చిత్ర నిర్మాణ సంస్థ అలాగే సంగీత దర్శకుడు థమన్ కూడా బిగ్ అప్డేట్స్ ఇచ్చేసారు. మరి ఈ మొదటి సాంగ్ అయితే “దం మసాలా” అంటూ ఒక మాస్ సింగిల్ ని కన్ఫర్మ్ చేయగా.
రేపు ఈ సాంగ్ తాలూకా ప్రోమో కూడా విడుదల చేస్తున్నట్టుగా మరో సర్ప్రైజ్ కూడా రివీల్ చేశారు. దీనితో ఈ సాంగ్ ప్రోమో రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా లాక్ చేసారు. దీనితో మొత్తానికి ఐతే ఈ అవైటెడ్ సాంగ్ పై రేపే ఓ క్లారిటీ రానుంది అని చెప్పొచ్చు.
అలాగే ఫుల్ సాంగ్ నవంబర్ 7న విడుదల చేస్తున్నట్టుగా కూడా ఫిక్స్ చేసారు. ఇప్పటికే లీక్ అయ్యిన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చేసింది. ఇక దీనిని క్యాష్ చేసుకోవడమే మిగిలి ఉన్న పని. మరి ఈ చిత్రాన్ని ఐతే మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసి ఉన్నారు.
https://x.com/haarikahassine/status/1720758288818884774?s=20