బిగ్ క్లాష్ : షారుఖ్ “డన్కి” వర్సెస్ “సలార్” ఖరారు 

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. కాగా ఈ చిత్రాల్లో కొన్ని ఎపిక్ క్లాష్ లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మెగాస్టార్, బాలయ్య అలాగే తమిళ్ నుంచి విజయ్ మరియు అజిత్ లు నడుమ కూడా పలు చిత్రాలు రీజనల్ గా మంచి హీట్ ఎక్కించగా..

తర్వాత అయితే మళ్ళీ ఆ రేంజ్ క్లాష్ లు రాలేదు. కాగా ఈ చిత్రాలు పక్కన పెడితే ఈ ఏడాది లోనే బిగ్గెస్ట్ క్లాష్ అంటూ వచ్చిన చిత్రాలు సలార్ ,మరియు డన్కి చిత్రాలు క్లాష్ ఇప్పుడు ఫిక్స్ అయ్యిపోయింది. ఈ చిత్రాలై రెండు కూడా డిసెంబర్ నెల లోనే లాక్ అయ్యాయి.

కానీ ముందే షారుఖ్ నటించిన చిత్రం డిసెంబర్ 22కి ఫిక్స్ చేసుకోగా మళ్ళీ ఇదే డేట్ లో అవైటెడ్ సలార్ లాక్ అవ్వడం పెద్ద ఎత్తున సంచలనానికి తెర లేపింది. దీనితో ఈ ఎపిక్ క్లాష్ ఫిక్స్ కాగా మధ్యలో మళ్ళీ షారుక్ సినిమా తప్పుకుంటుంది అని రూమర్స్ వచ్చి చల్లబడ్డాయి.

అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ భారీ యుద్ధంపై క్లారిటీ వచ్చేసింది. షారుఖ్ చిత్రం డన్కి ఒకరోజు ముందుకు జరిగి డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ నెంబర్ 1 దర్శకుడు రాజు హిరానీ తెరకెక్కించడం షారుఖ్ కూడా రెండు సినిమాలు హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉండడంతో హైప్ తారా స్థాయిలో ఉంది. ఇక మరి రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.