ఈ నేపథ్యంలో పోలిటికల్ పరిచయాలు తో తప్పించుకోవాలని విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ కేసుతో నూతన్ నాయుడికి సంబంధం లేదనుకున్నా విచారణలో ప్రధాన నిందుతుడే అతనే అన్నట్లుగా వెలుగులో్కి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు నూతన్ నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెప్పి ఏకంగా 12 కోట్ల రూపాయాలకే టోకరా వేసాడు. అయితే ఇక్కడే నూతన్ నాయుడు మరో డ్రామాకి తెరలేపాడు. ప్రస్తుతం కడుపు నొప్పిగా ఉందని తగ్గే వరకూ కస్టడీకి తీసుకోవద్దని పోలీసుల్నీ కోరాడు. కానీ పోలీసులు అందుకు ససేమీరా అన్నారు.
కడుపు నొప్పికి స్పెషలిస్ట్ లతో వైద్యం చేయిస్తాంగానీ..తమరు మాత్రం ముందు పోలీస్ జీపు ఎక్కాల్సిందేనని కుండబద్దలు గొట్టేసారు. దీంతో ఒకప్పుడు నూతన్ నాయుడుకి సోషల్ మీడియా వేదికగా ఓట్లు వేసిన వారే ఇప్పుడు అదే మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ అనే సరికి నూతన్ నాయుడికి కడుపునొప్పి..ఒళ్లు నొప్పులు వచ్చేస్తున్నాయా? అని కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ షోలో అవసరం మేర హౌస్ లో నాటకాలు ఆడటం సహజం. కానీ నూతన్ నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా అదే తరహా డ్రామాలు జైలులో కూడా ఆడుతున్నాడా? అంటూ జోరుగా ట్రోల్ చేస్తున్నారు.
ReplyForward
|