ఆ కోరిక తీర్చుకోవడానికి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టిన ఎన్టీఆర్ భార్య.. అడ్డు చెప్పిన ఎన్టీఆర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన అనంతరం హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.లక్ష్మీ ప్రణతి కూడా కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఎన్టీఆర్ కి తగ్గ భార్య అనిపించుకున్నారు. భర్తతో పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఈ ఫ్యామిలీలో ఎన్టీఆర్ భార్య ప్రణతికి తీరని కోరిక ఒకటి ఉందట. ఈ కోరికను తీర్చుకోవడం కోసం ఏకంగా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ దంపతులకు పిల్లలంటే చాలా ఇష్టం.ఇక వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రణతికి ఒక అమ్మాయి కావాలని కోరిక ఉందట.రెండవసారి ఆమె గర్భం దాల్చినప్పుడు తప్పకుండా తనకు బిడ్డ పుడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశారట కానీ తనకు కొడుకు పుట్టడంతో లక్ష్మీ ప్రణతి కాస్త డిసప్పాయింట్ అయినట్లు ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు.అయితే తనకు కూతురు అంటే ఇష్టం ఉండటం చేత తన కోరికలు నెరవేర్చడం కోసం ఈమె మూడవసారి గర్భం దాల్చడానికి కూడా సిద్ధమైందని తారక్ వెల్లడించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తానే వద్దని చెప్పానని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి కోరికను బయటకు పెట్టారు.