రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన కాంతార హీరో?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం కాంతార. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ భాషలో విడుదలయ్య అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేశారు. ఇలా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి కలెక్షన్లు సునామీ సృష్టించింది. ఇలా కాంతర సినిమా మంచి హిట్ కావడంతో ఎంతోమంది ఈ సినిమా పట్ల ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే హీరో ఎన్టీఆర్ సైతం కాంతార సినిమా చూసిన తర్వాత ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారని డైరెక్టర్ రిషబ్ శెట్టి వెల్లడించడమే కాకుండా త్వరలోనే ఆయనను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయనున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై స్పందించినటువంటి రిషబ్ శెట్టి తాను ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచన కూడా చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

తాను ఒక సినిమా చేయాలని భావించినప్పుడు ముందుగా నటీనటులను ఎంపిక చేయను స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసిన తరువాత ఆ స్క్రిప్ట్ కు సరిపడే నటీనటులను ఎంపిక చేసుకుంటానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్ తో సినిమా చేయలేదని ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ముందుగా తానే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటానని రిషబ్ శెట్టి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సినిమా అన్ని భాషలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.