Devara: ఎన్టీఆర్‌ ‘దేవర’ ప్రత్యేక షోలకు అనుమతి!

Devara: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ ‘దేవర: పార్ట్‌`1’ సెప్టెంబరు 27న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త చెప్పబోతోంది. ‘దేవర’ స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అగ్ర కథానాయకుల సినిమాల విడుదల సమయంలో ప్రీమియర్‌ షోలను ప్రదర్శిస్తుంటారు.

Devara Movie: ఆలోచించి ‘దేవర’ టైటిల్‌ ఖరారు చేశాం: అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్‌!

అంతేకాదు, మొదటివారం టికెట్‌ ధరలపెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ‘దేవర’ చిత్ర బృందం తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్‌ షోలు, టికెట్‌ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం జీవోను విడుదల చేయనున్నారు.

Devara: ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌… మహేశ్‌బాబు గెస్ట్‌ అంటూ ప్రచారం

తొలిరోజు అర్ధరాత్రి 1గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Director Geetha Krishna Shocking Comments On Jr NTR || Devara Review || Chiranjeevi || Telugu Rajyam