Devara: ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌… మహేశ్‌బాబు గెస్ట్‌ అంటూ ప్రచారం

Devara: ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై వార్తలు దుమారం రేపుతున్నాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) వస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తరువాత ఎన్టీఆర్‌ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్‌ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి.

NTR’s Devara: తమిళనాట ‘దేవర’ ప్రమోషన్‌… ఓ సినిమా చేయాలంటూ వెట్రిమాన్‌ను కోరిన ఎన్టీఆర్‌

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్‌లో బుకింగ్స్‌ స్టార్ట్‌ అవ్వగా 5 లక్షలకు పైగా టికెట్స్‌ బుక్‌ అయినట్లు మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు రీసెంట్‌గా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు టాలీవుడ్‌ నుంచి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుని పిలవాలని ‘దేవర’  (Devara Movie) టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే భరత్‌ అనే నేను ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ (Jr NTR) చీఫ్‌ గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. దీంతో అప్పటినుంచి మహేశ్‌- తారక్‌ల మధ్య బాండింగ్ మరింత ఎక్కువ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌కు మాత్రం మహేశ్‌ వస్తే అభిమానులకు ఆనందానికి హద్దు లేకుండా పోతుందని చెప్పవచ్చు. హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు జనతా గ్యారేజ్‌ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. సైఫ్‌ అలిఖాన్‌ విలన్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌, గెటప్‌ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘దేవర’ రామాయణం స్పూర్తితో తీసారేమో… ట్రైలర్‌ చూసి అంచనా వేసిన రచయిత పరుచూరి!