NTR in Bollywood : బాలీవుడ్ బడా నిర్మాతతో చర్చలు…ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైనట్టేనా…!

NTR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కెంచిన RRR కలెక్షన్ల సునామీ సృష్టిస్తోం. మార్చి 25వ తేదీన విడుదలైన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనపై అందరూ మాట్లాడుతున్నారు. నార్త్‌ నుంచి సౌత్‌ దాకా ఆర్‌ఆర్‌ఆర్‌ హవా నడుస్తోంది.ప్రత్యేకించి ఎన్టీఆర్ నటనకు అభమానులు తో పాటు సెలబ్రిటీలు అందరు ఫిదా అవుతున్న సంగతి తెలిసేందే.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఫాన్స్ పెరిగారనే చెప్పవచ్చు.నార్త్ లో కూడా ఎన్టీఆర్ ఫాలోయింగ్ బాగా పెరిగింది అనే చెప్పవచ్చు.అంతే కాదు బాలీవుడ్ మెగా నిర్మాణ సంస్థ అయినా ధర్మ ప్రొడక్షన్ వారు ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ సంప్రదింపులకు ఎన్టీఆర్ కూడా సుముఖాత చూపిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఐతే ఈ ధర్మ ప్రొడక్షన్ సంస్థ కరణ్ జోహార్ ది కావడం విశేషం. కరణ్ జోహార్ సౌత్ ఇండియా సినిమాలు ల గురించి ఎపుడు సానుకూలంగానే స్పందిస్తారు. అంతే కాకుండా కరణ్ జోహార్ ఇప్పటికే ఎన్టీఆర్ తో ఒక మల్టీలింగ్యుయల్ చిత్రన్ని నిర్మించాలని సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈ సినిమా కు భారీ మొత్తం లో ఆఫర్ చేసినట్టు కూడా సమాచారం. ఇదే నిజం ఐతే బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ తన నటన విశ్వ రూపాన్ని చూయించ పోతున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వం లో వస్తున్న సినిమా జూన్ లో ప్రారంభిస్తున్నట్లు సమాచారం.