NTR 30: లీక్స్ పై కొరటాల సీరియస్ వార్నింగ్

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కావడంతో ఎన్టీఆర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన సెట్ లో అర్ధరాత్రి షూటింగ్స్ ఎక్కువగా జరిగాయి. ఇక రెండవ షెడ్యూల్ మొదలుకావడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.

అయితే అంత బాగా కొనసాగుతున్న సమయంలో లొకేషన్స్ లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లిక్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మంచి అవుట్ ఫిట్ తో ఉన్న ఫోటోలు కూడా లీక్ కావడంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ షాక్ అయ్యిందట. ఎంతో పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ తరహాలో ఎందుకు లీక్ అయ్యాయి అని కొరటాల శివ చిత్ర యూనిట్ పై సీరియస్ అయినట్లు కలుస్తోంది.

ఇక వెంటనే లీక్ చేసిన పారిపై చర్యలు తీసుకోవాలి అని కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో నెక్స్ట్ మాత్రం ఎలా జరగకుండా చూసుకోవాలి అని ఆయన ప్రత్యేకంగా మేనేజ్మెంట్ కోసం సూచించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మరో 15 రోజుల తరువాత స్టార్ట్ కానుంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే ఫిక్స్ అయ్యింది.