NTR: ఆ హీరోలతో నటించాలని ఉంది మనసులోని మాట బయటపెట్టిన తారక్..!

NTR: తెలుగు చిత్ర సీమలోకి నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎపుడో నిరూపించుకున్నాడు.సినిమా కుటుంబంతో వచ్చిన తాను సొంతంగా ఎదిగాడు. చిన్న వయసులోనే బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్స్ ను అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఎన్టీఆర్ కి ఉన్న అభిమానుల గురించి చెప్పక్కర్లేదు ఫ్యాన్స్ ఆయన్ను మాన్ అఫ్ మాస్ఎస్ గా పిలుచుకుంటారు.

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటిసారిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా జనవరికే పూర్తయి విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇపుడు మార్చి 25 న విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. కొంతమంది స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని మనసులోని మాటను చెప్పారు.

ఫ్యూచర్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎలాంటి హీరోలతో సినిమా చేస్తారు అన్న ప్రశ్నకు.. ” నేను ఫ్యూచర్ లో మల్టీస్టారర్స్ చేయాల్సి వస్తే.. బాల బాబాయి, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌తో చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ చెప్పిన ఈ సమాధానానికి అప్పుడే అభిమానులు ఊహల్లో తేలిపోతున్నారు.