ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ ను చూసి తప్పు చేశా అంటున్న యంగ్ హీరో

టాలీవుడ్ లో 2000 సంవత్సరం నుండి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అప్పటివరకు హీరో అవ్వాలంటే కనీసం 25 సంవత్సరాలు దాటకుండా ఎవ్వరూ హీరో అయ్యేవారు కాదు. కానీ తరుణ్, ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్, నితిన్ లాంటి హీరోస్ 20 అంతకంటే తక్కువ వయసులోనే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ లను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తాను కూడా చిన్న వయసులోనే హీరోగా మారి తప్పు చేశాను అంటున్నాడు బాలాదిత్య. చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’, ‘అబ్బాయిగారు’, ‘హలో బ్రదర్’, ‘అన్న’ లాంటి చాలా సినిమాల్లో నటించి ‘చంటిగాడు’ సినిమాతో హీరో గా మారాడు బాలాదిత్య.

తొలి సినిమా మంచి సక్సెస్ అయినా కానీ, హీరో గా నిలబడలేకపోయారు బాలాదిత్య. తర్వాత టెలివిషన్ లో అనేక సీరియల్స్ చేసిన బాలాదిత్య తాజాగా బిగ్ బాస్ సీజన్ 6  లో పాల్గొన్నాడు.

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావడంతో నేను కూడా సినిమాల్లోకి రావాలని అనుకున్నానని బాలాదిత్య వెల్లడించాడు.

ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చే సినిమాలను తియ్యాలంటే చాలా కష్టమని  అయితే ‘పొలిమేర’ సినిమా తన కెరీర్ కు ప్లస్ అయిందని బాలాదిత్య అన్నాడు. అలాగే ఇప్పటికీ ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య, వదిన ఏం చెబితే అది ఫాలో అవుతున్నానని బాలాదిత్య తెలిపాడు.