Jr NTR: బరువు తగ్గనున్న ఎన్టీఆర్.. కారణం అదే!

Jr NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ఉందని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం గురించి కొన్ని నిజాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా ఎన్టీఆర్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని.. ఇంకా సమయం ఉండటంతో ముందుగానే ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నామని తెలిపాడు. లుక్స్ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నానని.. ఈ సినిమా కోసం తాను బరువు కూడా తగ్గించుకుంటున్నానని తెలిపాడు. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి డైరెక్టర్ తో చర్చలు జరుగుతున్నట్లు.. పైగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది.