NTR: బాలీవుడ్ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్…! దర్శకుడు ఎవరో తెలుసా..?

NTR: తెలుగు చలన చిత్ర పరిశ్రమ గొప్పదనాన్ని నలుదిక్కుల చాటింప చేసింది ఆర్ఆర్ఆర్ .దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరో లు గా వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. విడుదల అయిన రోజు నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఈ సినిమా అంచనాలకు మించి రిజల్ట్ ను అందించింది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఇరువురు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.

ఈ సినిమా విడుదల అయినప్పటి నుండి రాజమౌళి దర్శకత్వం మీద ఎన్టీఆర్, చరణ్ నట విశ్వరూపం మీద ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. కొమరం భీముడో…. పాటలు ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అవ్వని వాళ్ళు లేరు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు నార్త్ లో కూడా అభిమానులు పెరిగారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా నార్త్ లో కూడా రికార్డు లు సృష్టిస్తోంది.

ఈ సినిమా లో ని ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినా ఒక బాలీవుడ్ డైరెక్టర్ భారీ మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారు అని వార్తలు వినిపిస్తున్నాయ్.ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి సదరు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.అయితే ఇంత వరకు ఈ విషయం గురించి ఎన్టీఆర్ తో చర్చించడం కానీ, మిగిలిన విషయాలు కానీ ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం అయితే ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరు, ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే మరో హీరో ఎవరు అన్నది గొప్యంగా వుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు.