RRR: మా స్నేహం బయట ప్రపంచానికి తెలియనిది…తారక్, చరణ్…!

 

RRR: ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25న రిలీజ్ అవుతుండటంతో, దీనికి సంబంధించిన ప్రచారం జోరుగా జరుగుతోంది.ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రచారం ఊపందుకునే కొద్దీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించి ఆసక్తికర విశేషాలు బయటపడుతున్నాయి.అభిమానులు మాత్రమే తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ కొట్టుకుంటారు.. కానీ హీరోలు మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటారు.ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య స్నేహం అయితే మరింత బలపడిందని పలు సందర్భాల్లో ఇద్దరూ వెల్లడిస్తునే ఉన్నారు.

ప్రమోషన్స్ లో తారక్ ఒక సీక్రెట్ ను రిలీవ్ చేశాడు. చరణ్ కు, తనకు మధ్య స్నేహం ఎలా పుట్టింది.. తాము ఇద్దరం కలిసి అర్ధరాత్రి ఏమి చేస్తాము వంటి అనేక సీక్రెట్‌ని చెప్పాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తన ప్రణతి అంటే రామ్‌చరణ్‌ కు భయమని చెప్పడం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మా ఇద్దరి మధ్య స్నేహం ఎప్పటినుంచో ఉందని, చరణ్ ది నారి పిన్ని మనస్తత్వాలనీ, భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి అన్నట్టుగా మా మధ్య స్నేహం కుదిరిందని చెప్పారు.

నాకు చరణ్ కి మధ్య ఒక సీక్రెట్ ఉందని, దాని గురించి చెబుతూ.. మార్చి 26 తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు… ఆ రోజు 12 గంటలకు భార్య ప్రణతి పుట్టిన రోజు తో సెలబ్రేట్‌ చేసుకుని.. వెంటనే అర్ధరాత్రి చరణ్ పుట్టిన రోజు జరుపుకోవడానికి వెళ్లిపోయేవాడినని చెప్పాడు. అప్పటికే తన ఇంటి ముందు చరణ్ కారు రెడీగా ఉండేది.. అప్పుడు నేను సైలెంట్ గా ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాడని, ఇలా చాలా సార్లు జరిగిందని ఎన్టీఆర్ చెప్పాడు. అలా అర్ధరాత్రి చరణ్ పుట్టిన రోజు జరుపుకుని ఎంజాయ్ చేసేవాళ్లమని.. చెప్పాడు తారక్.అయితే తన ఇంటి గేట్‌ వద్ద ప్రణతి ఉంటుందేమో అని రామ్‌చరణ్‌ భయపడేవాడట.ప్రస్తుతం ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు మెగా, నందమూరి అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.