NTR: ఎన్టీఆర్ కు కర్ణాటకతో బలమైన బంధం.. కారణం ఏంటంటే..?

NTR: టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన స్థానం. నందమూరి వారసుడుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్ తన నటనతో డాన్స్ తో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన నటన విశ్వరూపం తో అభిమానులను పెంచుకున్నాడు. మామూలుగానే మన టాలీవుడ్ హీరోలకు కర్ణాటక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఎన్టీఆర్ కు కర్ణాటకకు మంచి అనుభందమే వుంది.

మిగిలిన హీరోలతో పోలిస్తే ఎన్టీఆర్ కర్ణాటక లో ఫాన్స్ కూడా ఎక్కువే. దీనికి కారణం ఎన్టీఆర్ తల్లి గారు కర్ణాటక కు చెందిన వారు కావడం, అందుకే ఎన్టీఆర్ కు కర్ణాటక కు మంచి అనుబంధం వుంది.ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషనలలో భాగంగా కర్ణాటక లో జరిగిన ప్రిరిలీజ్ వేడుక ఎంత ఘనంగా జరిగిందో అందరికి తెలిసిందే.అంతే కాదు అక్కడి ఫాన్స్ ఎన్టీఆర్ ను చిత్రాబృందాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారట.

ఇక ఇపుడు ఇంకొక వార్త ఏంటంటే కర్ణాటక యంగ్ హీరో, కేజీఫ్ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిన యశ్ కి కూడా ఎన్టీఆర్ తో మంచి అనుభందం ఉందట.అంతే కాదు యశ్ షూటింగ్ సమయం లో హైదరాబాద్ లో వున్నప్పుడు ఎన్టీఆర్ ఇంటి నుంచే భోజనం వచ్చేదట.ఎన్టీఆర్ గారి తల్లి తోకూడా యశ్ కు మంచి అనుభందం ఉందట.ఎన్టీయార్ ఇంటికి కూడా తరచూ యష్ వెళ్లి వస్తుండేవాడట.ఇది ఇలా ఉండగా యశ్ కి ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉండటం తో ఎన్టీఆర్ ఫాన్స్ అంట యశ్ ని అభిమానిస్తున్నారు.