NTR: ఆశ పాశం…..అంటూ పాటపాడి అందరిని ఫిదా చేసిన ఎన్టీఆర్…!

NTR: ఆర్ఆర్ఆర్ విడుదలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వబోతోంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడడంతో ప్రచార కార్యక్రమాలు మళ్ళీ మొదలెట్టారు చిత్ర బృందం. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లోను ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు.

ప్రొమోషన్స్ కోసం గుజరాత్, కలకత్తా, ముంబై, బెంగళూరు ఇలా మొత్తం ఇండియా చుట్టేస్తూ ప్రొమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు. ఇక ఈ ప్రొమోషన్స్ లో భాగంగా మీడియా ఇంట్రాక్షన్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ సూపర్ ఆక్టివ్ గా సమాధానాలు చెప్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు ఈ విషయం. లో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్ని భాషలలోనూ మాట్లాడుతూ అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ను మీ చరవాణిలో ఎక్కువ గా వినే పాట ఏమిటి అని అడిగితే కేర్ అఫ్ కంచరపాలెం సినిమాలోని’ ఆశా పాశం….బంధీ చేసేనే..’ పాట తను ఎక్కువగా ఈ మధ్య కాలం లో వింటున్న పాట అని చెప్పారు.అంతే కాకుండా పాసి వినిపించారు. ఇక ఈ వార్త ఇపుడు బాగానే వైరల్ అయింది నెట్టింట్లో. కేర్ అఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా ట్విట్టర్ వేదిక గా స్పందించారు.యూ మేడ్ మై డే….ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ అంటూ ట్వీట్ చేసాడు.అయితే అభిమానులతో పాటు సంగీత ప్రియులు కూడా ఎన్టీఆర్ పాటకు ఫిదా అవుతున్నారు.