NTR : పారితోషికం పెంచేసిన యంగ్ టైగర్…. కొరటాలతో సినిమాకి ఎన్ని కోట్లో తెలుసా…!

NTR : మంచి నటుడుగా ఎన్టీఆర్ కు గుర్తింపు ఉంది అయితే ఆర్ఆర్ఆర్ మరో మెట్టు ఎక్కించింది. ఇక దేశం మొత్తం ఎన్టీఆర్ నటన గురించి తెలిసేలా చేసింది. కొమరం భీమ్ గా ఒదిగిపోయిన తీరు అందరిని ఆకట్టుకుంది. సొంత మనిషిని చేసింది. అందుకే కొమరం భీముడో పాటలో కన్నీరు పెట్టుకొని ప్రేక్షకుడు ఉండడు. థియేటర్లలో నాటు నాటు పాటలో ఇద్దరి డాన్స్ కు ఎంత ఊపొచ్చిందో కొమరం భీముడో పాట వచ్చేసరికి ఎన్టీఆర్ నటనకు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.

అమాయకపు అడవి బిడ్డ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. ఆ పాత్రలో తాను తప్ప మరెవరు చేయలేరని జక్కన్నే స్వయంగా చెప్పడం, ఈ ప్రశంసలకు అతడు అర్హుడంటూ చెప్పడం నిజమే అనిపిస్తుంది సినిమాలో పాత్ర నిడివి తక్కువగా ఉంది అంటూ అభిమానులు నిరాశ పడినా కొమరం భీముడో పాట ఒక్కటి చాలు ఎన్టీఆర్ నటన చూడటానికి ఒకే సీన్ లో మూడు భావాలు పలికించడం నటుడుగా ఎన్టీఆర్ కే సాధ్యమైందని చెప్పక తప్పదు.

ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. ఏ ప్రాంతానికి వెళితే ఆ భాషా మాట్లాడి అక్కడి ప్రేక్షకులతో కనెక్ట్ అయిన ఎన్టీఆర్ ఇండియా లెవెల్లో అందరివాడు అయ్యాడు. ఇక ఇపుడు ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో తన 30వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన పారితోషకాన్ని పెంచేసాడట. ఆర్ఆర్ఆర్ కోసం 45 కోట్లు తీసుకున్న ఎన్టీఆర్ ఇపుడు ఏకంగా 55 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.ఏకంగా 10కోట్లు పెంచేసాడట. పాన్ ఇండియా లెవెల్లో అంత క్రేజ్ వచ్చినపుడు ఇక రెమ్యూనరేషన్ పెంచడంలో వింతేముంది. కొరటాల సినిమా కోసం 70 రోజుల కాల్షీట్లు ఇచ్చిన ఎన్టీఆర్ 70 రోజులకు 55 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి మొదలవ్వబోతోంది.