Rajamouli : మరోసారి ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురైన రాజమౌళి….!

Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి నటన అందరిని ఆకట్టుకుంది. కానీ రామ్ చరణ్ కు ఎన్టీఆర్ కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ రామ్ చరణ్ కు ఇచ్చాడని రాజమౌళిపై అసహనం వ్యక్తం చేసారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ విషయంలో స్వయానా ఎన్టీఆరే వివరణ ఇచ్చిన కూడా అభిమానులు మాత్రం సంతృప్తి పడలేదు.

ఇక పుండు మీద కారం చెల్లినట్టు ఈ మధ్య రాజమౌళి ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ ను సెల్ఫ్ మేడ్ యాక్టర్ అంటూ పొగడటంతో ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు ఆపాదించుకుని ఫీల్ అయ్యారు. రాజమౌళి పై మరోసారి గుర్రుమన్నారు. ఇక ఇది చాలదన్నట్టు రాజమౌళి పస్థ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి ఇపుడు ఎన్టీఆర్ అభిమానుల కంట పడింది. ఇక ఎన్టీఆర్ తో సోలో హీరోగా గరుడ అనే ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నా రాజమౌళి చేయకుండా ఆర్ఆర్ఆర్ సినిమా చేసాడట .

ఈ విషయం ఇపుడు వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత కోపం తెచ్చుకుంటున్నారు జక్కన్న మీద. అయిన ఆర్ఆర్ఆర్ లో స్క్రీన్ స్పేస్ తక్కువ అని గింజుకుంటున్న కొంత మంది అభిమానులు ఎన్టీఆర్ నటనకు కొమరం భీముడో పాట ఒక్కటి చాలు అందులో నట విశ్వరూపాన్ని చూపాడు. అలాంటప్పుడు ఇలాంటి వింత వాదనలు చేసి అబసుపాలవ్వుతారు అంతే తప్ప ఇంకేం కాదు.