ఎన్టీయార్ కూడా వేలు పెడుతున్నాడట.!

ఎన్టీయార్ కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలకు ఈ తరహా రూమర్లు వచ్చేవి. అదేనండీ.! తన సినిమాల్లో ఎన్టీయార్ వేలు పెట్టేస్తున్నాడనీ, కెలికి కెలికి కంపు చేస్తున్నాడనీ ప్రచారం జరిగేది. అలా కొన్ని సినిమాలు ఫెయిలైన సందర్భాలు కూడా గతంలో వున్నాయ్.

అయితే, ఇలాంటి రూమర్లు ఎన్టీయార్ విషయంలో ఈ మధ్య వినిపించడం లేదు. అయితే, ‘దేవర’ సినిమాలో తాజాగా ఈ తరహా రూమర్లు వినిపిస్తున్నాయ్. అయితే, ‘దేవర’ సినిమా ఎన్టీయార్‌కి చాలా చాలా ప్రతిష్ఠాత్మకమైనది. ‘ఆచార్య’ ఎఫెక్ట్‌తో కొరటాల శివ పైనే పూర్తిగా నమ్మకం పెట్టేయడానికి లేదు.

సో, ఆ కారణంగా అంతా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడనుకోవాలా.? లేదంటే, కొరటాలపై నమ్మకం లేకే ఇలా చేస్తున్నాడనుకోవాలా.? అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏం జరిగినా.. ఇది ఒకింత అతి మంచి పరిణామమే.. కొరటాలని గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో ‘ఆచార్య’ దెబ్బకి దిమ్మ తిరిగిపోయిన సంగతి తెలిసిందే.

ఆ తప్పు మళ్లీ జరక్కూడదంటే ఎన్టీయార్ ఇలా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందంటూ ఫ్యాన్స్ కూడా సూచిస్తున్నారు.