అభిమానులపై యంగ్ టైగర్ ఎన్టీయార్ గుస్సా.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో అభిమానులు అనవసర రాద్ధాంతం చేస్తుండడంపై మొదటి నుంచీ యంగ్ టైగర్ ఎన్టీయార్ ఒకింత ఆందోళనతోనే వున్నాడు. సినిమా విడుదలైన రోజే, ‘రామ్ చరణ్ హీరో.. ఎన్టీయార్ కేవలం సైడ్ యాక్టర్’ అంటూ ఎన్టీయార్ అభిమానులే దారుణమైన ట్వీట్లేశారు. రాజమౌళిని నానా రకాలుగా తిట్టారు.

కొందరు అభిమానులు మాత్రం, ‘గ్లోబల్ స్టార్ ఎన్టీయార్’ అంటూ తమ అభిమాన హీరోకి ఎలివేషన్లు ఇస్తూనే వున్నారు. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎన్టీయార్ హాజరు కాలేకపోయాడు. చరణ్ హాజరయ్యాడు.. దానిపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.

ఈ క్రమంలో ఎన్టీయార్ పేరు కూడా ట్రోలింగ్ అవుతోంది. ఈ మొత్తం పరిణామాలపై ఎన్టీయార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. అభిమానులకి ఇటీవలే తన కొత్త సినిమా విషయమై క్లాస్ తీసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. అయినా అభిమానులు మారడంలేదాయె. అభిమానుల్ని సున్నితంగా డీల్ చేయాలి. ఆ విషయం ఎన్టీయార్‌కి బాగా తెలుసు. కానీ, తప్పడంలేదు.