తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్న ఇప్పుడు దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రాలు ఐతే భారీ లాభాలు ఇస్తున్నాయి లేదా కోలుకోలేని నష్టాలు మిగులుస్తున్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ గా తాను నటించిన తాజా చిత్రం “భోళా శంకర్” ఇంకా తక్కువ బిజినెస్ నే జరిపినప్పటికీ..
ఇంకా ఈ చిత్రం ఆచార్య కి మించే నష్టాలు మిగిల్చింది అని టాక్ ఉంది. దీనితో ఈ సినిమా ఎంత పెద్ద ప్లాప్ అనేది అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రం విషయంలో చాలా పెద్ద రచ్చే నడిచింది. పలువురు పనిగట్టుకొని మరీ నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడం అలా స్ప్రెడ్ చేసిన వాటిని కొందరు సినీ ప్రముఖులు విమర్శకులు కూడా సున్నితంగా సపోర్ట్ చేయడంతో అవి నిజమే అన్నట్టుగా వెంటనే పాకేసాయి.
అయితే టాలీవుడ్ కి చెందిన ఓ ఇద్దరు సీనియర్ మోస్ట్ సినీ పెద్దలు ఇన్ని రోజులు చిరుకి మద్దతుదారులు అన్నట్టుగా కటింగ్ ఇచ్చి భోళా శంకర్ విషయంలో మాత్రం బయట పడ్డారు. కాగా వారు భోళా పై మొదట నెగిటివ్ స్ప్రెడ్ చేయగా ఈ అంశాల్లో చిత్ర నిర్మాత అనీల్ సుంకర సీరియస్ గా తీసుకున్నారు అనే కన్ఫర్మేషన్ రావడంతో ఇప్పుడు తమకి ఏమీ తెలియదు అన్నట్టుగా బిల్డప్ లు సోషల్ మీడియాలో ఇస్తుండడం వారెవ్వా అనిపిస్తుంది.
దీనితో మెగా ఫ్యాన్స్ ఇన్ని రోజులు చేయాల్సింది చేసి ఇప్పుడు మెగాస్టార్ పై సింపతీ ఉన్నట్టు భళే నటిస్తున్నారు అని మండిపడుతున్నారు. ఇంత భయం ఉన్నవాళ్లు ఇంత త్వరగా ప్లేట్ తిప్పేస్తారు అనుకోలేదని అంటున్నారు. మొత్తానికి అయితే ఇపుడు భోళా నిర్మాత దెబ్బకి ఈ సినీ పెద్దలు భయపడ్డారు అని ఫ్యాన్స్ అంటున్నారు.