Prabhas Powerful First Look: సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి ఆజానుబాహుడు గా ప్రభాస్ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Prabhas Powerful First Look: రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ లో తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక ఒక పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇది నిమిషాల్లో వైరల్ గా మారింది

“ఇండియన్ సినిమా…. మీ అజానుబాహుడును చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 . #స్పిరిట్ ఫస్ట్ లుక్” అని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు.

ఒళ్లంతా గాయాలతో, బ్యాండ్‌-ఎయిడ్‌లు కట్టుకుని ప్రభాస్‌ వెనక్కి తిరిగి నిలబడి వున్న రా అండ్‌ రస్టిక్‌ పోస్టర్‌ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డం పాత్ర ఇంటన్సిటీ ని మరింత పెంచుతోంది.

చేతిలో మద్యం సీసా పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ని తెలియజేస్తోంది. అతని పక్కన ఉన్న త్రిప్తి డిమ్రీ ఒక ఎమోషనల్ మూమెంట్ లో అతని సిగరెట్‌ను వెలిగిస్తూ కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది.

ఈ ఫస్ట్ లుక్, ప్రభాస్ పోషిస్తున్న పాత్రను ఇంటన్సిటీ, పవర్ ని తెలియజేస్తోంది. హింస, అంతర్గత సంఘర్షణ చుట్టూ తిరిగే ఒక ఫెరోషియస్ కథను ప్రజెంట్ చేస్తోంది.

ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ ప్రారంభ దశలో ఉంది, ప్రభాస్ ఇప్పటికే తన ఎక్సయిట్మెంట్ ఎక్స్ ప్రెస్ చేయడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెరిగాయి.

Journalist Bharadwaj Reaction On Spirit First Look Poster || Prabhas || Sandeep Reddy Vanga || TR