నిఖార్సయిన ప్యాన్ ఇండియా హీరో నిఖిల్ మాత్రమే.!

ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోలంటే ప్రబాస్, రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్.. వీళ్లు మాత్రమే. అయితే, ప్యాన్ ఇండియా ముద్ర వేయించుకున్నాకా ప్రబాస్ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్.

రామ్ చరణ్, ఎన్టీయార్‌లు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇంతవరకూ మరో సినిమాతో రాలేదు. అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. ‘పుష్ప’ తర్వాత ‘పుష్ప 2’ రావడానికి ఇంకా చాలా సమయమే వుంది.

కానీ, యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ అలా కాదు. చిన్న సినిమా అయిన ‘కార్తికేయ 2’తో ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం ‘స్సై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధీన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే రిలీజ్ చేయబోతున్నారు.

అలాగే, ‘వీర సవార్కర్’ అంటూ రీసెంట్‌గా ఇంకో సినిమాని అనౌన్స్ చేశారు. ఇదీ ప్యాన్ ఇండియా సినిమానే. రేపో ఎల్లుండో మరో ప్యాన్ ఇండియా సినిమానీ ప్రకటించేందుకు సిద్ధంగా వున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే, నిఖిల్ భవిష్యత్‌లో పేద్ద ప్యాన్ ఇండియా హీరోగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. సో, అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరో అంటే నిఖిల్ సిద్దార్డే ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో.. అని ఇండస్ర్టీ వర్గాలే కాదు, సినీ ప్రియులందరిలోనూ టాక్ వినిపిస్తోంది.