ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఒక భారీ బడ్జెట్ సినిమాని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని ఏ ఒక్క విషయంలోను కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ డిసైడయ్యారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో లెజండ్స్ నటించబోతున్నారని తాజాగా ప్రకంటించిన బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ ని ప్రకటిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ సమర్పణలో ఆయన కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తుంది. అవసరమైతే ఈ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని ఎంచుకున్న మేకర్స్ ఇప్పుడు అమితాబ్ ని ప్రకటించారు. అలాగే సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ ని ఫైనల్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమాని ఒక స్కై ఫై థ్రిల్లర్ గా రూపొందించబోతుండగా ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు గారు క్రియోటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ మాత్రమే కాదు తమిళం, మలయాళం భాషల నుంచి కూడా లెజండరీ యాక్టర్స్ ని తీసుకోకున్నారని సమాచారం. అయితే ఏ ఒక్క విషయాన్ని బయటకి రాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారట. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.