Home TV SHOWS Bigg boss 4: రాహుల్ సిప్లిగంజ్ ముందు కూడా అవినాష్ పరువు తీసేసిన నోయల్?

Bigg boss 4: రాహుల్ సిప్లిగంజ్ ముందు కూడా అవినాష్ పరువు తీసేసిన నోయల్?

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ మూడో సీజన్ విజేత. అంతే కాదు.. నాలుగో సీజన్ కు బిగ్ బాస్ బజ్ అనే ప్రోగ్రామ్ కు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లను రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు. తాజాగా గత వారం హౌస్ నుంచి బయటికి వచ్చిన నోయల్ ను రాహుల్ ఇంటర్వ్యూ చేశాడు. దానికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఇంకా రాలేదు కానీ.. దానికి సంబంధించిన ప్రోమోను మాత్రం అప్ లోడ్ చేశారు.

Noel Sean Comments On Avinash With Rahul Sipligunj
noel sean comments on avinash with rahul sipligunj

ఆ ప్రోమోలో అవినాష్ గురించి చెప్పు.. అని రాహుల్ అడగగా.. అవినాష్ మీద తనకున్న కోపాన్నంతా కక్కేశాడు. అవినాషే కాదు.. అమ్మ రాజశేఖర్ మాస్టారు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లిద్దరు ఆటను పక్కదారి పట్టిస్తున్నారంటూ విరుచుకుపడ్డాడు.

అప్పుడెప్పుడో ఏదో టాస్క్ జరిగితే.. ఆ టాస్క్ లో తాను ఏమనకున్నా.. జాగ్రత్త అన్నందుకు.. తనపై అరిచాడని.. అది అవినాష్ గేమ్ స్ట్రాటజీ అని నోయల్ చెప్పుకొచ్చాడు. మాస్టారు కూడా అంతే.. టాపిక్ ను డైవర్ట్ చేయడంలో హౌస్ లో వాళ్లను మించిన వాళ్లు లేరన్నాడు నోయల్.

ఒకరి పెయిన్ ను ఎగతాళి చేయడం కామెడీ ఎలా అవుతుంది. కామెడీ క్రియేట్ చేయడం గొప్పతనం కానీ.. ఇంకొకరిని ఎగతాళి చేయడం గొప్పతనం కాదు.. అంటూ అవినాష్ పై తెగ ఫైర్ అయిపోయాడు నోయల్.

దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి..

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News