ఇండియాలో “ఆదిపురుష్” కి పెద్ద అడ్డు లేనట్టేనా.?

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆడియెన్స్ అంతా కూడా ఆసక్తిగా థియేటర్స్ లో విట్నెస్ చెయ్యాలని ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సినిమా ఏదైనా ఉంది అంటే అది “ఆదిపురుష్” అని చెప్పాలి. పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ వండర్ అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కింది.

మరి ఈ చిత్రం రిలీజ్ కి జస్ట్ కొన్ని రోజులే ఉండగా ఫ్యాన్స్ లో అంతకంతకు ఉత్కంఠ నెలకొంది. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాకి ఇండియాలో అయితే పెద్ద పోటీ తప్పినట్టే తెలుస్తుంది. కాగా మన దగ్గర నార్త్ బెల్ట్ సహా తెలుగు తమిళ భాషల్లో పలు హాలీవుడ్ సినిమాలకి కూడ మంచి క్రేజ్ ఉంది.

మరి ఈ క్రేజ్ లో అయితే లేటెస్ట్ గా రాబోతున్న “ది ఫ్లాష్” పై మంచి అంచనాలు నెలకొనగా దీని కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం ఇండియా లో మాత్రం చాలా తక్కువ సంఖ్యలో 3డి వెర్సన్ లో రిలీజ్ కాబోతుందట.

దీనితో అయితే ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న ఆదిపురుష్ 3డి రిలీజ్ కి అయితే పెద్ద అడ్డంకే ఇప్పుడు తప్పుకున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కాబోతుండగా ది ఫ్లాష్ చిత్రం జూన్ 15న రాబోతుంది.

ఇది 2డి లోనే ఎక్కువ ఇండియాలో రిలీజ్ కాబోతుండడంతో ఆదిపురుష్ పై అయితే ఎఫెక్ట్ చాలా తక్కువ పడుతుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ చిత్రానికి అజయ్ అతుల్ లు సంగీతం అందిస్తుండగా టి సిరీస్ భూషణ్ కుమార్, ఓం రౌత్ లు నిర్మాణం వహించారు.