Sithara: అమ్మతో ముద్దుకు గ్యాప్ వద్దు… క్యూట్ పిక్స్ షేర్ చేసిన సితార…. ఫొటోలు వైరల్!

Sithara: సూపర్ స్టార్ మహేష్, నమ్రత శిరోద్కర్ ల గారాల పట్టి సితార. సితార మల్టీ టాలెంటెడ్ కిడ్ అనే చెప్పవచ్చు. తన పాటలతో, డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ యూ ట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతుంది.  దీంట్లో వీరు చేసే అల్లరి మామూలుగా ఉండట్లేదు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు, అలానే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం విదేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడు మంచి మంచి ప్రదేశాలను కూడా సితార తన ఛానల్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

అంతేకాకుండా ఒక హాలీవుడ్ మూవీకి కూడా డబ్బింగ్ చెప్పింది. తన తండ్రి ,అన్నతో కలిసి చేసే చిలిపి పనులు అన్ని పోస్ట్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా సర్కారు వారి పాట సినిమాలో బాగా పేరు తెచ్చుకున్న కళావతి పాటకు డాన్స్ చేసింది.ఈ వీడియోను మహేష్ కూడా తన ఇన్‏స్టాలో షేర్ చేస్తూ.. మై స్టార్.. నన్ను బీట్ చేసింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సితార చేసిన డాన్స్ వీడియో కు నమ్రతా శిరోద్కర్ కూడా మురిసిపోతూ… ఇంకా ఏం చెప్పగలను ?.. లవ్ లవ్ లవ్ యూ మై లిటిల్ వన్ అంటూ ట్యాగ్ చేసింది.  సితార డాన్స్ కు సూపర్ స్టార్ మహేష్,నమ్రత నే కాదు అభిమానులు సైతం ఫిదా అయిపోయారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న సితార తాజాగా తన తల్లి నమ్రతతో కలిసి కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో సితారకు నమ్రత ముద్దులిస్తున్నట్టుగా ఉంది. మీ అమ్మతో కిస్ తీసుకోవడంలో చాలా గ్యాప్ వస్తే వెంటనే అమ్మతో ముద్దు తీసుకోండని కామెంట్ పెట్టింది సితార. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది.