ప్రభాస్ దెబ్బకి షాక్ లో నితిన్ ..?

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా గోపీ కృష్ణ మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ కీలక పాత్ర పోషిస్తుంది.

On Prabhas' Birthday, Feel The &Amp;Quot;Beats Of Radhe Shyam&Amp;Quot;

ఇంతకముందు విదేశాలలో షూటింగ్ జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసుకొని షూటింగ్ వెళ్ళి కరోనా కారణంగా అనుకున్నషెడ్యూల్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇండియాకి తిరిగి వచ్చిన రాధే శ్యామ్ టీమ్ రీసెంట్ గా మళ్ళీ 15 రోజుల షూటింగ్ కోసం యూరప్ వెళ్ళారు. అయితే తాజా సమాచారం ప్రకారం షెడ్యూల్ కంప్లీట్ కాకుండానే టీమ్ అంతా తిరిగి ఇండియాకి వచ్చేయనున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం యూరప్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలుకావడంతో పలు చోట్ల కఠిన నిబంధనలు అమలు చేయడమే కాకుండా చాలాచోట్ల మళ్ళీ కర్ఫ్యూ విధిస్తున్నట్లు లేటెస్ట్ న్యూస్. అన్ని జాగ్రత్తలు పటిస్తూ చిత్రీకరణ జరపాలని చూస్తున్న ‘రాథే శ్యామ్’ యూనిట్ రోజులో మూడు – నాలుగు గంటల కంటే ఎక్కువసేపు చిత్రీకరణ జరపలేకపోతున్నట్టు తెలుస్తుంది.

Rang De First Look: Nithiin Birthday Treat - Tollywood

ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమా మీద కూడా పడిందని సమాచారం. త్వరలో ‘రంగ్ దే’ టీమ్ ఒక షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళాలని భావించి రెడీ అయిన నేపథ్యంలో ‘రాథే శ్యామ్’ యూనిట్ కి ఎదురైన అనుభవాల దృష్ఠ్యా ఇక అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదని నితిన్ డిసైడయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ‘రాథే శ్యామ్’ యూనిట్ కి మళ్ళీ కష్టాలు తప్పలేదు అంటున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles