తల్లి కాబోతున్న నిత్యా మీనన్… వైరల్ అవుతున్న పోస్ట్?

Nithya Menon

అలా మొదలైంది సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన నిత్యామీనన్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా కొన్ని ప్రధాన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న నిత్యామీనన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో నిత్యమీనన్ షేర్ చేసిన ఒక పోస్ట్ తీవ్రదుమారాన్ని రేపింది. ఈ పోస్టు వల్ల నిత్యామీనన్ తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా నిత్యామీనన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తూ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తు.. అండ్ ది వండర్ బిగిన్స్ అంటూ టాగ్ లైన్ పెట్టింది. దీంతో నిత్యమీనన్ కి ఎప్పుడు పెళ్లయింది? అంటూ ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

అయితే అసలు విషయం ఏమిటంటే.. నిత్యమీనన్ నటించబోయే తదుపరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ పోస్ట్ షేర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే నిత్యామీనన్ ఇలా పోస్ట్ షేర్ చేయటంతో..సినిమా ప్రమోషన్ల కోసం ఇలా అభిమానులకు తప్పుడు సంకేతాలు పంపాలా.? అంటూ కొందరు నెటిజన్లు నిత్యా మీనన్‌ పై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.