Hero Nithin: జూనియర్ గా నితిన్.. అల్లు అర్జున్ డైరెక్టర్ తో బారీ ప్లాన్!

Hero Nithin: నితిన్ జయం సినిమాతో వెండితెరకు పరిచయమయి తనకంటూ గుర్తుంపు తెచ్చుకుని హీరో గా సెటిల్ అయ్యాడు.అయితే నితిన్ కెరీర్ అంత సాఫిగా ఏమి లేదు ఎన్నో వైఫల్యాలు చూస్తూ వచ్చాడు. అయిన కూడా హీరోగా నిలదొక్కుకున్నాడు. పెళ్లి తర్వాత గత ఏడాది నితిన్ మూడు సినిమాలు చేసాడు.
రంగ్ దే,చెక్, మాస్ట్రోతో అలరించాడు నితిన్. అయితే రంగ్ దే, మాస్ట్రో పర్వాలేదనిపించిన చెక్ మాత్రం నిరాశపరిచింది. ఇక ఇపుడు కిక్, రేస్ గుర్రం వంటి సినిమా లకు కథ అందించిన రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్ లో నటించనున్నారు.

వక్కంతం వంశీ డైరెక్టర్ గా అల్లు అర్జున్ తో తీసిన నా పేరు సూర్య సినిమా వంశీకి చేదు అనుభవం మిగిల్చినా ఈసారి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక వంశీ, నితిన్ కాంబినేషన్ లో సినిమాకు జూనియర్ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇక నితిన్ తాజాగా ఎడిటర్ శేఖర్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న’ మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తున్నారు.

ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా నితిన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వక్కంతం వంశీ, నితిన్ కాంబినేషన్ సినిమా కిక్, రేస్ గుర్రం సినిమాల తరహా లోనే చిన్నపాటి సందేశంతో పూర్తి ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించనున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన వంశీ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.