నితిన్‌..ఎక్టార్డ్రినరీ మ్యాన్‌!

టాలీవుడ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ‘ఆర్డినరీ మ్యాన్‌’. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేమ్‌ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా.. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో నితిన్‌ యాక్షన్‌ మాస్‌ జోనర్‌ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఊర మాస్‌ సినిమాలు సెట్‌ కావనే విషయంలో క్లారిటీ వచ్చేసిందని నితిన్‌ తెలిపాడు. ఇకపై ఊర మాస్‌, యాక్షన్‌ లాంటి కథలతో వచ్చే సినిమాలు చేయనని ఫన్‌, కమర్షియల్‌ అంశాలతో కూడిన సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయినట్లు వెల్లడించాడు.

దీంతో నితిన్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవులున్నాయి. ఇక జూనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రేమకథతో వస్తున్న ఈ చిత్రాన్ని నితిన్‌ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.