శ్రీమతి అంటే ఎంత ప్రేమో.. షాలినీ బర్త్ డేపై నితిన్ పోస్ట్ వైరల్

హీరో నితిన్ పెళ్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరుగుతుందన్న సంతోషం ఓ వైపు ఉంటే.. ఆ పెళ్లిని అందరికీ గుర్తుండిపోయేలా జరిపించాలనే ఆరాటం మరో వైపు ఉంది. అందుకే పెళ్లిని గ్రాండ్‌గా జరిపించాలని దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేశాడు. అంతా ఓకే అయింది.. అంతా బాగానే ఉందనుకునే సమయంలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా ప్రభావం చూపడం మొదలెట్టేసింది.

ఏది ఏమైనా దుబాయ్‌లోనే పెళ్లి ఉంటుందని అందరూ భావించారు. కరోనా వైరస్ ఉధృతి తట్టుకోలేక లాక్డౌన్ విధించడంతో అంతా తారుమారైంది. అలా దుబాయ్‌లో పెళ్లి కోసం దాదాపు ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఆ డబ్బులన్నీ కూడా వృథా అయిపోయాయని టాక్. చివరకు ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి నితిన్ తాను కోరుకున్న ప్రేయసి మెడలోనే తాళి కట్టేశాడు.

Nithiin Wishes To Shalini Kandukuri On Her Birthday
Nithiin wishes to Shalini Kandukuri on her Birthday

ఈ మధ్యే నితిన్ తన భార్య షాలినీని తీసుకుని హనీమూన్‌కు తీసుకెళ్లాడ. రంగ్ దే, అంధాదున్ షూటింగ్‌ల నిమిత్తం దుబాయ్ వెళ్లిన నితిన్.. పనిలో పనిగా హనీమూన్ ప్లానింగ్‌ను కూడా చేసేశాడు. నిన్న (జనవరి 7) షాలినీ బర్త్ డే. ఈ మేరకు నితిన్ తన శ్రీమతిపై ప్రేమను కురిపించాడు. నా అందమైన భార్యకు హ్యాపీ బర్త్ డే. నా జీవితంలో నీతో గడిపిన రోజులే ఎంతో సంతోషమైనవి, ముఖ్యమైనవి. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.. నీతో ప్రేమలోనే ఉంటాను అంటూ క్రేజీ ఫోటోను షేర్ చేశాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles