ప్రభాస్ ని ఫాలో అవుతున్న నితిన్

Rangde Nithiin Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కంటే నితిన్ సీనియర్. అయితే ఈ విషయంలో మాత్రం నితిన్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నారట. ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రాదే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం జార్జియా ఇటలీలో జరుపుకుంది. మార్చిలో ఇటలీలో షూటింగ్ జరుగుతుండగా కోవిద్-19 తీవ్రం కావడంతో ప్రభాస్ అండ్ టీం హుటాహుటిన షూటింగ్ ఆపేసుకొని ఇటలీ నుండి ఇండియాకు తిరిగి రావలసి వచ్చింది.

Radhe Shyam

ఇప్పుడు తాజాగా ప్రభాస్ తన రాదే శ్యామ్ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. సెప్టెంబర్ 29న ప్రభాస్ అండ్ టీం ఇటలీ కి ప్రయాణం అవుతుంది.  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ లో పాల్గొంటున్న పూజా హెగ్డే కూడా అదే రోజు ప్రభాస్ టీం తో ఇటలీకి బయలుదేరుతుంది. ఇటలీలో అక్టోబర్ 2 నుండి షూటింగ్ తిరిగి కొనసాగిస్తారట. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్ కోసం ఇటలీ వెళ్తున్న మొదటి జంట ప్రభాస్, పూజ హెగ్డే.

అలాగే లాక్ డౌన్ తర్వాత మొదటిసారి రంగదే షూటింగ్ కు వెళుతున్నారు కొత్త పెళ్లి కొడుకు నితిన్. వెంకట్ అట్లూరి, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రంగదే. ఈ సినిమా కూడా చాలా వరకు షూటింగ్ అయినప్పటికీ ఇంకా కొన్ని పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా పాటలు కూడా ఇటలీలో నితిన్ కీర్తి సురేష్ మీద చేయాలని అనుకుంటున్నాడట చిత్ర దర్శకుడు వెంకట్ అట్లూరి. అందుకే ఇటలీ షూటింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు అక్కడ లొకేషన్స్ మరియు వాతావరణం గురించి ప్రభాస్ ని అడిగి కొన్ని సలహాలు తీసుకోవాలని అనుకుంటున్నాడట నితిన్ .

చూద్దాం యంగ్ రెబల్ స్టార్ సలహాలు నితిన్ కి ఏమాత్రం ఉపయోగపడతాయో.