పొద్దున్నే షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చిన నితిన్..!

ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఉండి ఇప్పటికీ హీరోగా కంటిన్యు అవుతున్న యువ హీరోస్ లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకడు. మరి ఎన్నో ఏళ్ళు పాటుగా సరైన హిట్ లేకపోయినాఆ ఇన్నాళ్లు సర్వైవ్ అయ్యి టాలీవుడ్ లో తనకంటూ కొంత మార్కెట్ ని సెట్ చేసుకున్న నితిన్ హీరోగా ఇపుడు దర్శకుడు వక్కంతం వంశి తో ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో తాను నటిస్తున్నాడు.

కాగా ఇదిలా ఉండగా జస్ట్ కొన్ని రోజులు కితమే నితిన్ మరియు వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు  కాంబినేషన్ లో అనౌన్స్ చేస్తారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడు నుంచో అనౌన్స్ కావాల్సి ఉన్న ప్రాజెక్ట్ కాగా ఈ సినిమాపై ఇప్పుడు ఈ పొద్దున్నే నితిన్ షాకింగ్ సర్ప్రైజ్ అందించాడు.

ఈ ఉదయం 8 కి అలా తాను దిల్ రాజు వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టుగా డైరెక్ట్ ముహూర్తం ఫోటోలు కూడా పెట్టేసాడు. దీనితో ఈ ఊహించని అప్డేట్ ఓ షాకింగ్ గా మారింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ముగ్గురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిసి చేస్తున్న ఈ చిత్రానికి “తమ్ముడు” అనే టైటిల్ ని పెట్టినట్టుగా కూడా రివీల్ చేసాడు.

దీనితో మరోసారి పవన్ విషయంలో తన ప్రేమ ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పాలి. కాగా ఇపుడు సినీ వర్గాల్లో ఈ సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వైరల్ గా మారిపోయింది. ఇంకా ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి.