తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి. కరోనా సమయంలోనే నిశ్చితార్థం జరిగి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తుందంట మెగా ఫామిలీ. అయితే ఈ పెళ్లి గురుంచి ఒక ఆసక్తికరమైన విషయం బయట హల్చల్ చేస్తుంది.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె మెగా ప్రిన్సెస్ నిహారిక ప్రేమ వివాహం చేసుకుంటోందా? కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమేనా? అన్నది ఇప్పటికీ అభిమానులకు డౌట్. అయితే ఆ సందేహాన్ని నివృత్తి చేసే లీక్ ఒకటి అందింది. ఆ లీకేజీ ఏమంటే…
టాలీవుడ్ లో చాలా ప్రేమకథల్లానే నిహారిక ప్రేమకథ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఐజీ గారి సుపుత్రుడు చైతన్యతో నిహారిక లవ్ ట్రాక్ నడిచిందట. నిహారిక వెంట పడి మరి ప్రేమించమని అడిగి మరీ పెళ్లి సెట్ చేసుకున్నాడట అందగాడైన చైతన్య. వీరిద్దరి లవ్ స్టోరీ ఓ చిన్న కామన్ ఫ్రెండ్స్ పార్టీలో మొదలైయింది..! ఎప్పటినుంచో నిహారిక మీద క్రష్ తో ఉన్న చైతన్య మెల్లిగా మన మెగా డాటర్ కి ప్రపోజ్ చేసి అలా ఆ తతంగాన్ని పెళ్లి వరకు తీసుకువచ్చాడు..! అదన్న మాట మేటర్..!