బుద్ది లేదా అంటూ ఫైర్.. ప్రదీప్ పరువుదీసిన నిహారిక

బుల్లితెరపై ఈ దసరాకు సందడి వేరే లెవెల్‌లో ఉండబోతోంది. ఈ మేరకే ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటివి ప్రత్యేక ఈవెంట్లతో బిజీగా ఉంది. ఈటీవీలో అక్కా ఎవరే అతగాడు, స్టార్ మాలో జాతరో జాతర, జీ తెలుగులో ప్రదీప్ శ్రీముఖి పెళ్లి అంటూ స్పెషల్ ఈవెంట్ల రాబోతోన్నాయి. ఈ పాటికీ ప్రోమోలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో కాన్సెప్ట్. అయితే జీ తెలుగులో వచ్చే ఈవెంట్ కాన్సెప్ట్ పాతది.

శ్రీముఖి, ప్రదీప్ పెళ్లి అంటూ చూసే జనాలను పిచ్చోళ్లను చేసేందుకు వస్తున్నారు. సుధీర్ రష్మీ, సుధీర్ విష్ణుప్రియల పెళ్లిళ్లను కూడా ఇలాగే ఈవెంట్లలో చేసి రచ్చ చేశారు. ఈసారి ఈ కొత్త జోడినీ జీ తెలుగు వారు వాడుకుంటున్నారు. ఇప్పటికే ఓ శుభలేఖను రిలీజ్ చేశారు. నాగబాబు, నిహారిక, అనసూయలపై రిలీజ్ చేసిన ప్రోమో బాగానే క్లిక్కయింది. చిరంజీవి ప్రదీప్, చిలసౌ శ్రీముఖి అంటూ నాగబాబు, అనసూయ రెచ్చిపోయారు.

Exclusive : Telugu girl making big in Bollywood!

ఇక నిహారిక సైతం ఈ ఈవెంట్లో తన దైన శైలిలో రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రచ్చబండ, బతుకు జట్కా బండి స్ఫూప్ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో ప్రదీప్, శ్రీముఖి.. నిహారిక ఎదుటకు వచ్చారు. ఏమైంది అంటూ నిహారిక ప్రశ్నించగా.. ఆ లెటర్‌లో ఏముందో చెప్పండి అని ప్రదీప్ అడిగాడు. బుద్ది లేదా అంటూ నిహారిక ప్రదీప్‌పై ఫైర్ అయింది. అయితే వెంటనే ప్రదీప్ స్పందిస్తూ.. మీకు నా గురించి తెలీదు.. నేను ప్రదీప్ మాచిరాజు.. అని గొప్పగా చెప్పుకొచ్చాడు. వెంటనే నిహారిక స్పందిస్తూ.. మా అన్న రామ్ చరణ్ సీతారామరాజు అని కౌంటర్ వేసింది. ఇలా నిహారిక సెటైర్ వేసి ప్రదీప్ పరువును తీసింది.