బికినీ ధరించి ఆ పార్ట్ లో ఉన్న సీక్రెట్ టాటూ రివీల్ చేసిన నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక మొదట టీవి షో లో యాంకర్ గా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా తన తండ్రి నాగబాబుతో కలిసి ఎన్నో టీవీ షోలో గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఇలా బుల్లితెర ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నిహారిక మెగా కాంపౌండ్ లో అమ్మాయిలు ఎవరు చేయలేని సాహసం చేసి హీరోయిన్ గా మారింది. అయితే హీరోయిన్ గా నిహారిక సక్సెస్ కాలేకపోయింది దీంతో సినిమాలకు దూరమై చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

వివాహం తర్వాత కూడా తన భర్త ప్రోత్సాహంతో వెబ్ సిరీస్ లలో నటిస్తూ వాటిని నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారింది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో నిహారిక జోరు బాగా పెరిగింది. కొంతకాలం క్రితం పబ్ వివాదంలో చిక్కుకోవడం వల్ల కొంతకాలం సోషల్ మీడియాకు దూరమైన నిహారిక.. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ భర్త , స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్తూ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి టర్కీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన నిహారిక అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ టర్కీ వెకేషన్ లో నిహారిక బికినీ ధరించిన ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో నిహారికపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగ టర్కీ వెకేషన్ కి సంబంధించిన మరికొన్ని ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో బికినీ ధరించి ఇంతకాలం సీక్రెట్ గా ఉంచిన టాటూ ని కూడా చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ఇంతకాలం భర్తతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేసిన నిహారిక గత కొంతకాలంగా ఒంటరిగా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అందువల్ల వీరి విడాకుల విషయం మరొకసారి వైరల్ గా మారింది.