Niharika: సోషల్ మీడియా వచ్చినప్పటినుంచీ రోజూ ఏదో ఒక వార్త ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు, వారి వ్యక్తిగత వార్తల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వార్తలు నిజం కాకపోయినా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య వస్తున్న వార్తల్లో ఎక్కువగా టాలీవుడ్‌లో కపుల్ విడిపోయారని లేదా విడిపోతున్నారని, లవర్స్ బ్రేకప్ లాంటి న్యూస్ బాగా వినిపిస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇలా సామాజిక మాధ్యమాల తమ గురించి ఏదో ఒకటి రాసి వైరల్ చేయడం వల్ల కొంత మంది చాలా అభద్రతగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ప్రజలకు నిజం ఏదో, అబద్దం ఏదో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇకపోతే తాజాగా మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య పైన రకరకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. నిహారిక ఇటీవలే తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను క్లోజ్ చేయడంతో ఆ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు. ఆమె ఇప్పటివరకూ పర్సనల్‌గా ఇబ్బంది పడినా బయట మాత్రం పడలేదు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీలో ఎవరూ కూడా ఈ వార్తలపై ఇప్పటివరకూ స్పందించికపోవడం గమనార్హం.
ఇక వివరాల్లోకి వెళితే, ఇలా ప్రతీ రోజూ ఏదో ఒక అంశంపై తమను జనాల్లో నలిగేలా చేస్తున్న నిహారిక వీటన్నింటికీ సమాధానంగా ఆమె తన భర్త చైతన్యతో ఉన్న ఒక పోస్ట్‌ను చేశారు. ఇప్పటివరకూ ఆ దంపతులపై వస్తున్న కథనాలు అబద్దమని ఈ పోస్ట్‌ను చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం అలా తమపై వచ్చే రూమర్స్ అన్నింటీకి చెక్ పెట్టేందుకే ఈ పోస్ట్ చేసిందని పలువురి అభిప్రాయం. పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ, నిర్మాతగా మారారు నిహారిక. థింక్ ఎలిఫెంట్ అనే ఛానెల్ ద్వారా ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి సినిమాను నిర్మిస్తున్నారు.