ఇప్పుడిది అధికారికం.! నిహారిక తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంది. పరస్పర అవగాహనతో విడాకుల కోసం ఇద్దరూ కోర్టు మెట్లెక్కారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన నిహారిక, తమకు ప్రైవసీ అవసరం.. అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.
ఇంతకీ, నిహారిక ఎందుకు విడాకులు తీసుకుంది.? ఏ విషయంలో నిహారిక, ఆమె భర్త చైతన్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి.? కొన్నాళ్ళ క్రితం పబ్ వ్యవహారంలో నిహారిక విపరీతంగా ట్రోల్ అయితే, ఆమెకు అండగా నిలిచాడు చైతన్య.
కానీ, విషయం ఎక్కడో తేడా కొట్టింది. బహుశా సినిమాల్లో నటించాలని మళ్ళీ నిహారిక గట్టిగా నిర్ణయించుకోవడం వల్లేనన్నది ఓ వాదన.! మొన్నీమధ్యనే ఓ వెబ్ సిరీస్‌లోనూ నిహారిక కనిపించింది. అర్థం పర్థం లేని వెబ్ సిరీస్ అది. వల్గర్ డైలాగులూ నిహారిక చెప్పింది.
నటన ఒక్కటే కారణం కాదనీ.. తెరవెనుక పెద్ద కథే నడిచిందనీ రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయ్.! ఏమో, ఈ విషయంలో నిజమెంతో.! కానీ, నిహారికకి ఆమె మెట్టినిల్లు చాలా చాలా అండగా నిలిచింది. అలాంటి మంచి కుటుంబాన్ని నిహారిక కోల్పోవాల్సి రావడం స్వయంకృతాపరాధమేనని అనుకోవచ్చు.