మెగా డాటర్ నిహారికకు పెళ్లి ఫిక్స్ అయిందన్న సంగతి తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం కాక ముందే నిహారిక, చైతన్యలు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. మాటా ముచ్చట అయ్యాక నిహారిక తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. సోషల్ మీడియాలో తన భర్తను ఘాడంగా హత్తుకున్న ఫోటోను షేర్ చేసి అందరికీ సర్ ప్రైజ్‌ను ఇచ్చింది.
ఇక నిశ్చితార్థం రోజున నిహారిక, చైతన్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ ఇద్దరూ కలిసి జిమ్‌కు వెళ్లడం, కలిసే వర్కౌట్లు చేయడం తెగ సందడి చేశాయి. కానీ నిహారిక మాత్రం ఇప్పుడు తనకు కాబోయే భర్తను వదిలేసి తన ఫ్రెండ్స్‌తో కలిసి సందడి చేసేందుకు గోవాకు చెక్కేసింది.
మగవారందరూ పెళ్లికి ముందు తన స్నేహితులకు బ్యాచ్‌లర్ పార్టీలు ఇస్తారు కదా. అలాగే నిహారిక తన స్నేహితులకు బ్యాచ్‌లరెట్ పార్టీని ఇచ్చింది. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి గోవాకు బయల్దేరింది. నేటి తెల్లవారు ఝామున గోవాకు బయల్దేరిన నిహారిక ఉదయం నుంచి గోవాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇక అక్కడి వెళ్లాక డ్రెస్సింగ్‌లోనూ తేడా వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి నిహారికను బాగానే ఆట పట్టిస్తున్నారు.