మెగా సంగీత్ పార్టీ.. నిహారిక చైతన్య రచ్చ

Niharika Konidela And chaitanya In Sangeeth Party

మెగా డాటర్ నిహారిక వివాహా వేడుకకు ముహూర్తం దగ్గరపడింది. డిసెంబర్ 9న జరిగే ఈ వేడుకకు ఇప్పటికే బంధుమిత్ర సపరివారమంతా ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో దిగారు. మెగా అల్లు ఫ్యామిలీలు, ఇతర బంధుమిత్రులందరూ కూడా ప్యాలెస్‌లో అడుగుపెట్టారు. పెళ్లి వేడుకలు ఘనంగా మొదలుపెట్టారు. ఇక ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కో స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయ్ పూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్యామిలీ స్పెషల్ ఫ్లైట్‌లో నిన్న వెళ్లారు.

Niharika Konidela And chaitanya In Sangeeth Party
Niharika Konidela And chaitanya In Sangeeth Party

తరువాత బన్నీ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ ఇలా అందరూ స్పెషల్ చార్టెట్ ఫ్లైట్‌లో నిహారిక పెళ్లికి వెళ్లారు. ఇక అక్కడ అందరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా ఇంతా కాదు. ఓ రేంజ్‌లో దుమ్ము లేపినట్టు కనిపిస్తోంది. నిన్న రాత్రి సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక మెగా సంగీత్ ఈవెంట్లో మెగా అల్లు మనవరాళ్లు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. పిల్లలు చేసిన రచ్చ ఒకెత్తు అయితే కొత్త జంట చేసిన రచ్చ మరో ఎత్తు.

సుష్మిత, శ్రీజ, అల్లు బాబి కూతర్లు సంగీత్ ఈవెంట్లో దుమ్ములేపారు. ఏక్ బార్ ఏక్ బార్ అంటూ రామ్ చరణ్ పాటకు రచ్చచేశారు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురైన చైతన్య నిహారికలు రొమాంటిక్ పాటలకు అంతే రొమాంటిక్ స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ రెండు మూడు రోజులు నిహారిక పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలానే కనిపిస్తోంది. అయితే ఈ పెళ్లి వేడులకు పవన్ కళ్యాణ్ దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ముహూర్తం సమయానికి నేరుగా పవన్ వస్తాడని సమాచారం.